NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీలో రాష్ట్రప‌తి పాలన విధించాలి !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఏపీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం కొనసాగుతోంద‌ని, ఈ అంశం పై రాష్ట్రప‌తి రామ్ నాథ్ కోవింద్ కు ఫిర్యాదు చేసిన‌ట్టు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. టీడీపీ నేత‌ల‌తో క‌లిసి రాష్ట్రప‌తిని క‌లిసిన అనంత‌రం మీడియాతో మాట్లాడారు. దేశంలో గంజాయి, డ్రగ్స్ ఎక్కడ ప‌ట్టుబ‌డినా.. వాటి మూలాలు ఏపీలో ఉన్నాయ‌ని ఇత‌ర రాష్ట్రాల పోలీసులు చెప్పే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని చంద్రబాబు అన్నారు. అంత‌ర్జాతీయంగా, దేశీయంగా ఎక్కడా లేని లిక్కర్ బ్రాండ్లు ఏపీలో ఉన్నాయ‌ని ఆక్షేపించారు. డ్రగ్స్ ఫ్రీ ఏపీ కోసం టీడీపీ పోరాడుతుంద‌ని తెలిపారు. రాష్ట్రంలో మాట్లాడే హ‌క్కు లేద‌ని, ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నార‌ని అన్నారు. ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఏపీలో ఆర్టిక‌ల్ 356 ఉప‌యోగించి రాష్ట్రప‌తి పాల‌న విధించాల‌ని రాష్ట్రప‌తి రామ్ నాథ్ కోవింద్ ను కోరినట్టు చంద్రబాబు తెలిపారు.

About Author