NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెట్రోల్, డీజిల్ రేట్లు రాష్ట్రాలూ త‌గ్గించ‌వ‌చ్చు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించిన నేపథ్యంలో రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను తగ్గించాలని.. తగ్గించినా కూడా రాష్ట్రాలు ఇంకా లాభాల్లోనే ఉంటాయని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన తాజా నివేదికలో పేర్కొంది. కేంద్రం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్‌ డ్యూటీని పెంచడం వల్ల రాష్ట్రాలకు ఆటోమేటిగ్గా వ్యాట్‌ ఆదాయం భారీగా పెరిగిందని.. అన్ని రాష్ట్రాలకూ కలిపి దాదాపు రూ.49,229 కోట్ల మేర అధిక ఆదాయం వచ్చిందని ఎస్‌బీఐ తన నివేదికలో పేర్కొంది. రెండుసార్లు ఎక్సైజ్‌డ్యూటీని తగ్గించడం వల్ల రాష్ట్రాలకు రూ.15,021 కోట్ల మేర వ్యాట్‌ ఆదాయం తగ్గిందని వెల్లడించింది. అంటే.. పెంచిన ఎక్సైజ్‌ డ్యూటీ వల్ల రాష్ట్రాలకు ఇంకా రూ.34,208 కోట్ల మేర అధిక ఆదాయం వస్తున్నట్టేనని వివరించిం ది. కాబట్టి రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను కొంత మేర తగ్గిం చి చమురు ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించాలని సూచించింది.

                                                 

About Author