NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంబేద్కర్ విగ్రహా ప్రారంభోత్సవానికి తరలిరండి..

1 min read

మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మహానంది పిలుపు

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హోలగుంద విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం, స్మృతి వనం ప్రారంభోత్సవానికి అధిక సంఖ్యలో పాల్గొని విజవంతం చేయాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు జి మహానంది పిలుపునిచ్చారు.మంగళవారం మండల కేంద్రంమైన హాళగుందలోని స్థానిక ఎల్ ఎల్ సి గెస్ట్ హౌస్ లో  విలేకరుల సమావేశం నిర్వహించారు.  ప్రభుత్వం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించి జాతికి అంకితం చేయనున్నారు. అంబేద్కర్ విగ్రహం,ఆవిష్కరణ కార్యక్రమానికి కర్నూలు జిల్లా మాల మహానాడు జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలుపుతూ జిల్లాలోని మాల మహానాడు కార్యకర్తలు, అంబేద్కర్ వాదులు, దళితులు, బహుజనులు, అంబేద్కర్ అభిమానులు తండోపతండాలుగా తరలిరావాలన్నారు.అలాగే ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా సహాయ కార్యదర్శి పెద్దహ్యాట వీరభద్ర మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళితులకు సంక్షేమ పథకాలు కొనసాగించాలని కోరారు అదేవిధంగా జిల్లాలో రోజురోజుకు దళితులపై దాడులు మానభంగాలు జరుగుతున్నాయని దీనిని అరికట్టడంలో అధికార యాత్ర రంగం విఫలమైందని వారు అన్నారు,ఈ కార్యక్రమంలో, సీనియర్ నాయకులు మల్లేష్, పంపన్న, ఉపేంద్ర, చిదానంద, మల్లి తదితరులు పాల్గొన్నారు.

About Author