గాజులదిన్నెలో డా.బీ.ఆర్.అంబేద్కర్ విగ్రహావిష్కరణ
1 min readపల్లెవెలుగు వెబ్, గోనెగండ్ల : మండలంలోని గాజులదిన్నెలో రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డా.బీఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. శనివారం కెవిపిఎస్ మండల కార్యదర్శి బి. కరుణాకర్ నాయకత్వంలోని డప్పు కళాకారుల బృందం యొక్క డప్పుల నృత్యంతో 9 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి, కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి ఆనంద్ బాబు, జిల్లా అధ్యక్షులు దేవసహాయం, అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు ధనరాజ్, ప్రభుదాసు లు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పూలవర్షం కురిపించి… నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత దళితోద్దారకుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, సకలజనుల హక్కుల ప్రదాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం అంటే హక్కుల సాధనకు పునరంకితమవ్వడమే నని, నేటికీ హక్కులకు దూరంగా నెట్టివేయబడ్డ జాతి సంరక్షణ కై ఐక్యమై అంబేద్కర్ బాట లో ఉద్యమిద్దామని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో మిమిక్రి ఆర్టిస్ట్ ఉస్మాన్, డప్పు కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు కృపారావు, జిల్లా నాయకులు రాజు, మారేసు, దేవదాసు,దస్తగిరి, సంటెన్న, కర్రెన్న ,అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటి సభ్యులు శ్రీనివాసులు, సీమోను, గన్న,సూదర్శనం ,కిరణ్,రంగస్వామి, దేవసహాయం,రాజు,ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.