స్వర్గీయ శ్రీ శ్రీ శ్రీ నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: మద్దికెర మండలం, పెరవలి గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని పత్తికొండ శాసనసభ్యులు కె. యి. శ్యామ్ కుమార్ , కర్నూల్ పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు , తెదేపా జిల్లా అధ్యక్షులు తిక్కరెడ్డి , ఆదోని మాజీ శాసనసభ్యులు కె. మీనాక్షినాయుడు ఆవిష్కరించారు. ఈ సమావేశం ని ఉద్దేశించి ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి దాదాపు వంద విగ్రహాలు డిసెంబర్ లోపు ఆవిష్కరించే విధంగా చూస్తాం అని నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర నాయకులు, కర్నూలు జిల్లా నాయకులు, వివిధ మండల నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.