PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆరోగ్యంగా ఉండండి..

1 min read

– మాస్కులు పంపిణీ చేసిన సర్పంచ్​ మేక ప్రసన్నేశ్వరి
పల్లెవెలుగు వెబ్, చిట్వేలి: కరోన వైరస్​ విజృంభిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తలు పాటిస్తూ.. ఆరోగ్యంగా ఉండాలని తిమ్మయ్యగారిపల్లి పంచాయతీ సర్పంచ్​ మేక ప్రసన్నేశ్వరి సచివాలయ సిబ్బందికి సూచించారు. శనివారం ఏఎన్​ఎంలు, వాలంటరీ లు, ఆశా వర్కర్లు మరియు సచివాలయ ఉద్యోగులకు మొత్తం 21 మందికి స్పంచ్​ ప్రసన్నేశ్వరి, ఆమె భర్త జయరామిరెడ్డి కలిసి మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్​ మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రజల అవసరాలు తీర్చడంలో సచివాలయం సిబ్బంది పాత్ర కీలకమన్నారు. ఫీవర్​ సర్వే ద్వారా ప్రజల ఆరోగ్యంపై కాపాడుతున్న వాలంటీర్లు, ఆశావర్కర్లు, ఏఎన్​ఎంల సేవలు అద్వితీయమన్నారు. కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు, వైసీపీ గ్రామ నాయకులు మోచర్ల నరసింహులు, పంచాయతీ వార్డు నెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

About Author