NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దొంగ ఓట్లు వేస్తున్నారు: టీడీపీ

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: తిరుప‌తి ఉపఎన్నిక‌ల్లో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ టీడీపీ ఆరోపించింది. వైసీపీ నేత‌లు బ‌య‌టి ప్రదేశాల నుంచి బ‌స్సుల్లో ప్రజ‌ల్ని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేసే ప్రయ‌త్నం చేస్తున్నారంటూ టీడీపీ నేత‌లు చెబుతున్నారు. తిరుప‌తిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన ఫంక్షన్ హాల్ లోకి వేలాది మంది ప్రజ‌లు బ‌స్సుల్లో వస్తున్నారని, ఈ విషయంపై పోలీసుల‌కు స‌మాచార‌మిచ్చినా ప‌ట్టించుకోవ‌డంలేద‌ని విమర్శించారు. శనివారం ఉద‌యం 7 గంట‌ల నుంచి సాయంత్రం 7గంట‌ల వ‌ర‌కు పోలింగ్ జ‌రుగుతుంది. వైసీపీ నుంచి గురుమూర్తి, టీడీపీ నుంచి ప‌న‌బాక ల‌క్ష్మి, బీజేపీ నుంచి ర‌త్నప్రభ , కాంగ్రెస్ నుంచి చింతా మోహ‌న్ పోటీలో ఉన్నారు. ఎన్నిక‌ల ఏర్పాట్లు ప‌క‌డ్బందీగా చేశారు. కోవిడ్ నిబంధ‌న‌లు క‌ఠినంగా అమ‌లుచేస్తున్నారు.


About Author