PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భార‌త్ లో బంగ్లాదేశ్ ప్ర‌ధాని స్టెప్పులు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భార‌త్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన బంగ్లాదేశ్ ప్ర‌ధాన మంత్రి షేక్ హ‌సీనా గురువారం రాజస్థాన్‌లోని అజ్మీర్ ష‌రీఫ్ ద‌ర్గాను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా గురువారం మ‌ధ్యాహ్నం అజ్మీర్ ఎయిర్ పోర్టు చేరుకున్న హ‌సీనాకు స్థానిక అధికార యంత్రాంగం ఘ‌న స్వాగ‌తం ప‌లికింది. ఇందులో భాగంగా రాజ‌స్థానీ స్థానిక క‌ళాకారుల‌తో ఆమెకు రాజ‌స్థానీ సంప్ర‌దాయం ప్ర‌కారం స్వాగ‌తం ల‌భించింది. ఈ సంద‌ర్భంగా రాజ‌స్థానీ సంప్రదాయ సంగీతానికి స్థానిక క‌ళాకారులు నృత్యం చేస్తూ హ‌సీనాకు స్వాగ‌తం ప‌ల‌క‌గా… హ‌సీనా కూడా క‌ళాకారుల ఉత్సాహంతో తానూ పాదం క‌దిపారు. వీరి నృత్యానికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

                                             

About Author