PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జీరో పురోగతి సాధించకుండా చర్యలు తీసుకోవాలి

1 min read

– జిల్లా కలెక్టర్ డా.జి.సృజన

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  సచివాలయ పరిధిలో హౌసింగ్ నిర్మాణంలో జీరో పురోగతి సాధిస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో  సమీక్షలు నిర్వహించి ఏ ఒక్క సచివాలయ పరిధిలో  జీరో పురోగతి సాధించకుండా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్లను, ఎంపీడీవోలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.శనివారం  ఉదయం స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, హౌసింగ్ ఇంజనీర్లతో  హౌసింగ్, ఉపాధి హామీ పథకం అమలు, జగనన్న సురక్ష, విద్యాశాఖ అంశాల పై జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 3 నుండి 13వ తేదీ వరకు 121 సచివాలయాల్లో జీరో పురోగతి సాధించారని సంబంధిత సచివాలయాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో   సమీక్షలు నిర్వహించి ఏ ఒక్క సచివాలయంలో కూడా జీరో పురోగతి సాధించకుండా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్లను, ఎంపీడీవోలను కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా కృష్ణగిరి మండలంలో 3 సచివాలయాలు, ఆదోని మండలంలో 12 సచివాలయాలు,  నందవరంలో 7 సచివాలయాలు, హాలహర్వి  మండలంలో 7 సచివాలయాలు, కర్నూలు లో 9 సచివాలయాలు ఆస్పరి మండలంలో  కొన్ని సచివాలయాలు జీరో పురోగతి నమోదు చేశారని గత సమావేశంలో సచివాలయాల వారీగా జీరో పురోగతి సాధించిన ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమీక్షలు నిర్వహించుకొని జీరో పురోగతి ఉండకుండా చర్యలు తీసుకోవాలని చెప్పినప్పటికీ కూడా సమీక్షలు నిర్వహించడం లేదని కలెక్టర్ పేర్కొన్నారు. సంబంధించిన ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో  సమావేశం నిర్వహించి పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత మండలాల ఎంపీడీవోలను, హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్లను కలెక్టర్ ఆదేశించారు. బేస్మెంట్ లెవెల్ నుండి కంప్లీషన్ స్థాయి స్టేజ్ కన్వర్షన్ పనులలో తక్కువ లక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా జీరో పురోగతి సాధించడం ఏంటని కోడుమూరు, హాలహర్వి, ఆదోని మండలాల హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్లను ప్రశ్నించారు, బేస్మెంట్ లెవెల్ నుండి కంప్లీషన్ స్థాయి స్టేజ్ కన్వర్షన్ పనులలో పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.  కంప్లీషన్ స్థాయిలో ఉన్న ఇళ్ల నిర్మాణాలలో గోనెగండ్ల, ఓర్వకల్ తక్కువ శాతం లో ఉన్నారని త్వరితగతిన పనులు పూర్తిచేసి పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్లను ఆదేశించారు. OTS కి సంబంధించి ఎమ్మిగనూరు, ఆదోని మండలాల తహసిల్దార్ లాగిన్ లో పెండింగ్లో ఉన్న వాటిని త్వరితగతిన డిస్పోస్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత మండల తహసిల్దార్లను  ఆదేశించారు.జగనన్న సురక్షకు సంబంధించి సర్వీసెస్ జనరేట్ చేయడంలో కౌతాళం, క్రిష్ణగిరి మండలాలు చాలా వెనుకబడి ఉన్నారని సర్వీసెస్ జనరేట్ చేయడంలో పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత మండలాల ఎంపీడీవోలను కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా కౌతాళం మండలంలో వాలంటీర్  హౌస్ హోల్డ్ సర్వేలో కూడా తక్కువ శాతం ఉన్నారని, 33 శాతం మంది వాలంటీర్లు అసలు సర్వేనే మొదలు పెట్టలేదని  వివిధ కారణాలు చెప్పి పనులలో ఆలస్యం చేయొద్దని సంబంధిత సర్వేని కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కౌతాళం ఎంపీడీవోని కలెక్టర్ ఆదేశించారు.   సర్వీసెస్ డిస్పోస్ చేయడంలో కల్లూరు మండలం పురోగతి సాధించాలని సంబంధిత తహసిల్దార్ ని కలెక్టర్ ఆదేశించారు.ఉపాధి హామీ పనులకు సంబంధించి  లేబర్ మొబిలైజేషన్లో చిప్పగిరి, పెద్దకడుబూరు,ఆదోని మండలాలు తక్కువ మొబిలైజేషన్ చేశారని పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఎంపీడీవోలను కలెక్టర్ ఆదేశించారు. ఉపాధి హామీలో పని దినాలను పెంచే శాతంలో కల్లూరు, దేవనకొండ, క్రిష్ణగిరి మండలాలు వెనుకబడి ఉన్నాయని పని దినాల శాతాన్ని పెంచే  విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఎంపీడీవోలను కలెక్టర్ ఆదేశించారు. హార్టికల్చర్ ప్లాంటేషన్ కి సంబంధించి బ్లూ ఫ్రాగ్ యాప్ నందు పిట్టింగ్ అప్డేషన్  చేయడంలో  కల్లూరు, ఆస్పరి మండలాలు  తక్కువ శాతం లో ఉన్నారని పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మించాల్సిన చెత్త సంపద తయారీ కేంద్రాలు  ఆదోని మండలంలో, కౌతలంలో ఎక్కువ ఉన్నాయని తగిన ప్రణాళిక రూపొందించుకొని త్వరితగతిన నిర్మించాల్సిందిగా చర్యలు చేపట్టాలన్నారు.సర్వ శిక్ష అభియాన్ కి సంబంధించి  వాలంటీర్ల ద్వారా 5 నుండి 18 ఏళ్ల విద్యార్థుల సర్వేలో 91 శాతం పూర్తి చేశారని త్వరితగతిన 100 శాతం పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.   సిస్టం డ్రాప్ ఔట్ పిల్లల సంఖ్యను ఎందుకు తగించలేకపోతున్నారని ఆదోని, ఎమ్మిగనూరు మండలాల విద్యాశాఖ అధికారులను ఆరా తీశారు.  ఎమ్మిగనూరు మండల విద్యాశాఖ అధికారి స్పందిస్తూ ప్రైవేట్ పాఠశాలలు కో-ఆపరేట్ చేయడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకొని రాగా అటువంటి ప్రైవేట్ పాఠశాలలు ఎవరైనా కోపరేట్ చేయకుంటే వారికి నోటీసులు ఇవ్వాలని సర్వ శిక్ష అభియాన్ పిఓ ని కలెక్టర్ ఆదేశించారు. అదే విధంగా ఆదివారం నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత మండల విద్యాశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. టెలి కాన్ఫరెన్స్లో హౌసింగ్ పీడీ వెంకట నారాయణ, డ్వామా పిడి అమర్నాథ్ రెడ్డి,  జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, సర్వ శిక్ష అభియాన్ పిఓ వేణుగోపాల్  తదితరులు పాల్గొన్నారు.

About Author