నగరంలో దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి
1 min readస్పందనలో కలెక్టర్ డాక్టర్ సృజన కు వినతిపత్రం అందజేసిన రాయలసీమ సంఘాలు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగరంలో విజృంభించన దోమల నివారణకు మరిన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజనను కలిసి వినతిపత్రం సమర్పించారు రాయలసీమ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సుంకన్న,రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్, జిల్లా అధ్యక్షులు అశోక్ లు కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజనను కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు నగరంలో ప్రవహించే హంద్రీ నది,కేసీ కెనాల్ లో నీటి ప్రవాహం నిలిచిపోవడం,చెత్త,వ్యర్థాలను అందులో వేయడంవల్ల మురుగునీరుగా మారి గుర్రపుడెక్క పెరిగిపోవడం వలన దోమలు విపరీతంగా పెరిగి నగర ప్రజలకు కాటువేస్తూ అనారోగ్యాలు, విషజ్వరాలు ప్రబలి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని అన్నారు.నగరంలో దోమల నివారణకు మరిన్ని చర్యలు తీసుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి పోరాట సమితి నాయకులు వసంత్,సురేష్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.