లబ్దిదారులతో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలి
1 min read– డిఆర్డిఏ, వైఎస్ఆర్ కెపి ప్రాజెక్ట్ లో జరుగుతున్న అన్ని అంశాల్లో లక్ష్యాలు సాధించాలి..
– డిఆర్డిఏ పిడి డా : ఆర్ విజయరాజు
– 23 శాతం మేర తమకు జీతాలు పెంపుదలపై సియంకు కృతజ్ఞతలు తెలిపిన సెర్ఫ్ ఉద్యోగులు..
పల్లె వెలుగు, ఏలూరు జిల్లా : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్ధ (డిఆర్‌డిఏ) వైఎస్‌ఆర్‌కేపి ప్రొజెక్ట్ లో జరుగుతున్న అన్నీ అంశాలలో సమీక్ష చేసి ఎక్కడైతే వెనుకబడియున్న మండలాల వారి పనితీరును మెరుగుపరచుకొని లక్ష్యాలను త్వరిత గతిన పూర్తి చేయాలని డిఆర్డిఏ పిడి డా. ఆర్. విజయరాజు సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. స్ధానిక , వట్లూరులోని టిటిడిసిలో గురువారం డిఆర్‌డిఏ, వైఎస్‌ఆర్‌కేపి సిబ్బంది అయిన పియంలు,డిపియంలు, ఎపియంలు,సిసిలు తదితరులతో డిఆర్డిఏ పిడి డా. ఆర్. విజయరాజు సమీక్షా సమావేశము నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నవరత్నాలలో పేదలందరికి ఇళ్ళు సంబంధించి బిబిఎల్ నుంచి బిఎల్ వరకు ఈ నెలలో 5వేల మంది లబ్దిదారులతో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యతాంశముగా తీసుకుని త్వరితగతిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో పాల్గొన్న సెర్ప్ ఉద్యోగులు తమకు ప్రభుత్వం వారు ప్రకటించిన 23 శాతం జీతాలు పెంపుదల చేసినందుకు అన్నీ యూనియన్ల వారు ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాధములు తెలియజేశారు.