కర్ణాటక మద్యాన్ని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు చర్యలు : ఎస్ఐ
1 min readపల్లెవెలుగు వెబ్ కౌతాళం : రాబడిన సమాచారం మేరకు కోసిగి మండలం కడిదొడ్డి గ్రామానికి చెందిన బండేప్ప అనే వ్యక్తి కర్ణాటక రాష్ట్రం రాయచుర్ జిల్లా మాన్వి టౌన్ నుండి అక్రమంగా కర్ణాటక మద్యం తుంగభద్ర నది మీద తెప్ప మీద తీసుకొస్తుండుగా బండేప్ప నదిలో పారిపోగా, అతను అక్రమంగా తరలిస్తున్న 90 Ml పరిమాణం గల 1,094 (20బాక్షులు) ఒరిజినల్ ఛాయిస్ డీలక్స్ విస్కీ కర్ణాటక టెట్రా ప్యాకెట్లు ఎస్సై టీ నరేంద్ర కుమార్ రెడ్డి గారు మరియు వారి సిబ్బంది మల్లికార్జున,రంగన్న, హుస్సేని, నరేంద్ర మరియు నాగరాజు ల సహాయంతో పట్టుకొని సదరు 1,094 టెట్రా ప్యాకెట్లను మరియు తుంగభద్ర నది దాటడానికి ఉపయోగించిన తెప్పను స్వాధీన పరచుకొని కేసు నమోదు చేయడమైనది. కావున కర్ణాటక ఎలక్షన్స్ ను దృష్టిలో ఉంచుకొని ఎవరైనా కర్ణాటక మద్యం కల్గి ఉన్నా, అమ్మినా, సరఫరా చేసిన అలాగే ఆంధ్ర రాష్ట్రము నుండి కూడా కర్ణాటక వైపు మద్యం, డబ్బులు వంటి వస్తువులు తరలించిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకొనబడును. అక్రమ కర్ణాటక మద్యం సరాఫర లో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి హెచ్చరించారు.