ఇంకా బతికే ఉన్నా !
1 min read
పల్లెవెలుగువెబ్ : సినీనటి సమంత మయోసైటిస్ అనే దీర్ఘకాల కండరాల వ్యాధితో బాధపడుతున్నారు. తాను ఈ వ్యాధి బారిన పడ్డానని సమంత ప్రకటించినప్పటి నుంచి… సినీ పరిశ్రమ ప్రముఖులు, అభిమానులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆమె మాట్లాడుతూ, ఈ వ్యాధిని జయిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ‘యశోద’ సినిమా ప్రమోషన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ మేరకు స్పందించారు. ప్రపంచంలో మయోసైటిస్ వ్యాధిని చాలా మంది సమర్థవంతంగా ఎదుర్కొన్నారని సమంత చెప్పారు. తాను కూడా దీన్ని ఎదుర్కొంటానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురైన ఆమె కంటతడి పెట్టుకున్నారు. త్వరలోనే దీన్నుంచి బయటపడతానని అన్నారు. ‘నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు కొందరు వార్తలు రాశారు. అది నిజం కాదు. ప్రస్తుతం నేను ఆ పరిస్థితిలో లేను. ప్రస్తుతానికైతే నేను ఇంకా చావలేదు’ అన్నారు సమంత.