హీరోగా నిలబడటానికి ఇప్పటికీ కష్టపడుతున్నా !
1 min read
Naga Chaitanya at CBL Telugu Thunders Team Jersey Launch
పల్లెవెలుగువెబ్ : సినీ పరిశ్రమలోని బంధుప్రీతి పై యువ హీరో అక్కినేని నాగ చైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో నెపోటింజంపై నాగచైతన్యకు ఓ ప్రశ్న ఎదురైంది. ఇండస్ట్రీలో నెలకొన్న వారసత్వంపై మీ అభిప్రాయం ఏమిటనే ప్రశ్నకు బదులుగా… బాలీవుడ్ తో పోలిస్తే టాలీవుడ్ లో నెపోటిజం తక్కువనే చెప్పొచ్చని చైతూ అన్నాడు. తన తాత, తన తండ్రి ఇద్దరూ నటులేనని… వారి వారసుడిగా ఇండస్ట్రీలోకి చాలా ఈజీగా ప్రవేశించానని… కానీ, హీరోగా నిలదొక్కుకోవడానికి తాను ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నానని చెప్పాడు.