PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహానందిలో దుర్వాసన నీరే…తాగునీరు..!

1 min read

– ప్రజలు వ్యాధుల బారిన పడినా…
– ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు..
– పాలకుల అండదండలతో.. నిర్లక్ష వైఖరి..
పల్లెవెలుగువెబ్​, మహానంది: కర్నూలు జిల్లా మహానందిలోని దేవస్థానం కాలనీ, మిట్టబోర్డులో గత కొంత కాలం నుంచి మురుగునీటినే…తాగుతున్నారు. తాగునీరు సరఫరా అయ్యే పైపులైన్లు డ్రైనేజీ కాల్వలలో లీక్​ కావడంతో… తాగునీరు నుంచి దుర్వాసన వెదజల్లుతోంది. తప్పని పరిస్థితిలో కొందరు వేడి చేసి తాగుతున్నారు.. మరికొందరు ముక్కు మూసుకుని తాగుతున్నారు. ఈ విషయంపై ‘ స్పందన’ కార్యక్రమంలో ఫిర్యాదు చేసినా… అధికారులు నిర్లక్ష వైఖరితో వ్యవహరిస్తున్నారు.


రోగాల బారిన ప్రజలు..
మహానంది పంచాయతీ పరిధిలోని దేవస్థానం కాలనీ,మిట్టబోర్డులో మురుగునీరు రోడ్లపై నిల్వ ఉండటం… దీనికితోడు పైపులైన్లు లీక్​ అయి .. దుర్వాసన వెదజల్లుతున్న నీరు తాగుతుండటంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఓ వైపు దోమ కాటుకు పిల్లలు, వృద్ధలు, మహిళలు డెంగ్యు, మలేరియా సోకి ఆస్పత్రులలో చికిత్సపొందుతున్నారు. తాగునీరు, డ్రైనేజీ తదితర సమస్యలపై ఇటీవల ‘ స్పందన’లో ఫిర్యాదు చేశారు. మండల స్థాయి అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ప్రజలు చెబుతున్నారు.


పాలకుల ఆశీర్వాదం.. పుష్కలం..
జిల్లాలో ఎక్కడా లేనంతగా… మహానందిలో పని చేసే అధికారులకు… రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. పదోన్నతి రావాలన్నా… బదిలీ కావాలన్నా… ఇక్కడి అధికారులు సంబంధిత డిపార్ట్​మెంట్​ ఉన్నతాధికారుల దగ్గరకు వెళ్లరు… రాజకీయ నాయకుల దగ్గరకు వెళ్తే… పని ఖచ్చితంగా అవుతుందని వీరి అపార నమ్మకం. ఈ సాంప్రదాయమే కొనసాగుతోందని చెప్పవచ్చు. ఇకపోతే .. కష్టాలు… రోగాల బారిన పడుతున్నామని…సమస్య పరిష్కరించాలని ప్రజలు వేడుకున్నా .. పట్టించుకోని అధికారులు… పాలకులకు కొమ్ముకాస్తూ… వారి చెప్పినట్లే నడుచుకుంటున్నారు. ఫిర్యాదు వచ్చినా…. నాయకులే చేసుకుంటారని వారి ప్రగాఢ విశ్వాసం.

About Author