ఫ్లాట్ గా స్టాక్ సూచీలు
1 min readపల్లెవెలుగు వెబ్: భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు ..కొద్దిసేపటికే నష్టాల్లోకి చేరుకున్నాయి. రెండు రోజుల భారీ లాభాలకు .. గురువారం కొద్దిగా బ్రేక్ పడింది. తర్వాత 12 గంటల సమయంలో నిఫ్టీ, సెన్సెక్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ మాత్రం నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. మొత్తం మీద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు ఫ్లాట్ గా కదులుతున్నాయని చెప్పవచ్చు. మధ్యాహ్నం 12:40 నిమిషాల సమయంలో సెన్సెక్స్ 104 పాయింట్ల లాభంతో 54,476 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో 16,286 వద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ లో మాత్రం నష్టాలు కొనసాగుతున్నాయి. 130 పాయింట్ల నష్టంతో 35,900 వద్ద ట్రేడ్ అవుతోంది.