నష్టాల్లో స్టాక్ సూచీలు
1 min readపల్లెవెలుగు వెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో పయనిస్తున్నాయి. ఉదయం గ్యాప్ డౌన్ తో ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు.. ఆ తర్వాత రేంజ్ బౌండ్ లో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు నష్టాల్లో ట్రేడ్ అవుతుండగా.. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇండెక్స్ లు గ్రీన్ లో ట్రేడ్ అవుతున్నాయి. 12:50 నిమిషాల సమయంలో సెన్సెక్స్ 190 పాయింట్ల నష్టంతో 52,374 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 50- 41 పాయింట్ల నష్టంతో 15685 వద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ 125 పాయింట్ల నష్టంతో 35147 వద్ద ట్రేడ్ అవుతోంది.