నష్టాల్లో స్టాక్ మార్కెట్.. లాభాల్లో స్మాల్ క్యాప్ ఇండెక్స్
1 min readపల్లెవెలుగు వెబ్: భారత స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమై చివరికి నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా కరోన వైరస్ కొత్త వేరింయట్ ఒమిక్రాన్ వ్యాప్తి వేగం, లక్షణాల తీవ్రత వంటి అంశాల పై స్పష్టత రాని నేపథ్యంలో సూచీలు నష్టాల బాటపట్టాయి. యూరప్ స్టాక్ మార్కెట్లు కూడ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆటో, మెటల్స్, ఫైనాన్సియల్ సెక్టార్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో సూచీలు నష్టాల బాటపట్టాయి. అనూహ్యంగా స్మాల్ క్యాప్ ఇండెక్స్ లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్ 195 పాయింట్ల నష్టంతో 57064 వద్ద, నిఫ్టీ 70 పాయింట్ల నష్టంతో 16983 వద్ద, బ్యాంక్ నిఫ్టీ 281 పాయింట్ల నష్టంతో 35695 స్థాయి వద్ద క్లోజ్ అయ్యాయి.