NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్టాక్ మార్కెట్.. కార్పోరేట్ ఫ‌లితాలతో బుల్ జోష్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : భార‌త స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో క‌దులుతున్నాయి. అంత‌ర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా క‌దులుతున్నప్పటికీ.. దేశీయంగా సూచీలు బ‌ల‌మైన ర్యాలీ కొన‌సాగిస్తున్నాయి. ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్షియ‌ల్ షేర్లలో కొనుగోళ్లు మార్కెట్ ను లాభాల్లో న‌డిపిస్తోంది. కార్పొరేట్ కంపెనీల క్వార్టర్లీ ఫ‌లితాలు విడుద‌ల కానున్న నేప‌థ్యంలో సూచీల్లో బుల్ జోష్ క‌నిపిస్తోంది. ఉద‌యం 11:30 నిమిషాల సమ‌యంలో సెన్సెక్స్ 157 పాయింట్ల లాభంతో.. 54,437 స్థాయి వ‌ద్ద, నిఫ్టీ 44 పాయింట్ల లాభంతో 16,282 స్థాయి వ‌ద్ద, బ్యాంక్ నిఫ్టీ 220 పాయింట్ల లాభంతో 36,043 స్థాయి వ‌ద్ద క‌దులుతోంది. మార్కెట్లు లాభాల్లో కొన‌సాగుతుండ‌టంతో కొద్దిమేర ప్రాఫిట్ బుకింగ్ కూడ కనిపిస్తోంది.

,

About Author