భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్.. ఆల్ టైం హై వద్ద సూచీలు
1 min readపల్లెవెలుగు వెబ్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల దిశగా కదులుతున్నాయి. సోమవారం ఇంట్రాడే లో కొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి. వడ్డీ రేట్లు, ఎకానమీ స్టిమ్యులస్ విషయంలో యూఎస్ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ సానుకూలతను వ్యక్తం చేయడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగారు. ఆసియా మార్కెట్లు కూడ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వీటితో పాటు భారత్ లోకి గతంలో ఎన్నడూ లేని విధంగా విదేశీ పెట్టుబడులు రాక పెరిగింది. ఈ అంశాల కారణంగా స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో కదులుతున్నాయి. మధ్యామ్నం 2:30 నిమిషాల సమయంలో సెన్సెక్స్ 685 పాయింట్ల లాభంతో 56,813 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 207 పాయింట్ల లాభంతో 16,910 వద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ 719 పాయింట్ల భారీ లాభంతో 36,337 వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రధానంగా మెటల్ , పీఎస్ యూ బ్యాంక్ సెక్టార్లు మార్కెట్లను లీడ్ చేస్తున్నాయి.