భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్ !
1 min readపల్లెవెలుగువెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో పయనిస్తున్నాయి. ఉదయం పాజిటివ్ గా ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు అదే ఒరవడి కొనసాగించాయి. చైనాలో వరుసగా మూడోరోజు ఒక్క కరోన కేసు కూడ నమోదు కాకపోవడం, ఇండియా మైక్రో ఎకనమిక్ డేటా మెరుగుపడటం, జీఎస్టీ కలెక్షన్లు బాగా పెరగడం, సర్వీస్ సెక్టార్ గ్రోత్ ఇంప్రూవ్ కావడంతో పాటు టెక్నికల్ అంశాలకు కలసి రావడంతో సూచీలు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ నాలుగు అంశాలు మార్కెట్లలో జోష్ పెంచడానికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో సెన్సెక్స్ 1134 పాయింట్ల లాభంతో 54107 వద్ద , నిఫ్టీ 361 పాయింట్ల లాభంతో 16199 వద్ద ట్రేడ్ అవుతోంది.