NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లాభాల్లో స్టాక్ మార్కెట్.. కీల‌క రంగాల్లో కొనుగోళ్లు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : భార‌త స్టాక్ మార్కెట్ సూచీలు రెండో రోజూ లాభాల్లో కొన‌సాగుతున్నాయి. అంత‌ర్జాతీయంగా బ‌ల‌హీన సంకేతాలు ఉన్నప్పటికీ.. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల్లో కొనుగోళ్ల జోష్ నెల‌కొంది. దీంతో సెన్సెక్స్ , నిఫ్టీ , బ్యాంక్ నిప్టీ లాభాల‌తో ప‌రుగులు పెడుతున్నాయి. ఉద‌యం 11 గంట‌ల స‌మయంలో సెన్సెక్స్ 348 పాయంట్ల లాభంతో 54,750 స్థాయి వ‌ద్ద కొన‌సాగుతోంది. నిఫ్టీ 94 పాయింట్ల లాభంతో 16,353 స్థాయి వ‌ద్ద క‌దులుతోంది. బ్యాంక్ నిఫ్టీ 236 పాయింట్ల లాభంతో 36,265 స్థాయి వ‌ద్ద క‌దులుతోంది. ప్రస్తుతం సూచీలు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ లో ఉన్నాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ రెసిస్టెన్స్ జోన్ అధిగ‌మిస్తే.. మ‌రింత అప్ ట్రెండ్ కొన‌సాగే అవ‌కాశం ఉంది.

About Author