ఫ్లాట్ గా స్టాక్ మార్కెట్ సూచీలు
1 min readపల్లెవెలుగు వెబ్: భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాల నేపథ్యంలో సూచీలు ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం పాజిటివ్ గా ట్రేడింగ్ మొదలుపెట్టి అనంతరం నెగిటివ్ జోన్ లోకి చేరింది. నిఫ్టీ, సెన్సెక్స్ స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతుండగా.. బ్యాంక్ నిఫ్టీ స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సెన్సెక్స్ 141 పాయింట్ల స్వల్ప లాభంతో 58790 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో 17,523 వద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ 182 పాయింట్ల లాభంతో 37102 వద్ద ట్రేడ్ అవుతోంది.