లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు !
1 min read
పల్లెవెలుగువెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. సోమవారం భారీ నష్టాల నుంచి కోలుకున్న యూఎస్ మార్కెట్లు తిరిగి లాభాల్లోకి చేరుకున్నాయి. అదే బాటలో ఇండియన్ స్టాక్ మార్కెట్ పయనిస్తోంది. ఆటో, పవర్, రియాల్టీ రంగాలు లాభాల్లో కొనసాగుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీలు సూచీల్లో లాభాల జోరుకు కారణమయ్యాయి. మధ్యాహ్నం 1 గంట సమయంలో నిఫ్టీ 133 పాయింట్ల లాభంతో 17087 వద్ద, సెన్సెక్స్ 395 పాయింట్ల లాభంతో 56975 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.