ద్రవ్యోల్బణంతో నష్టాల్లోకి స్టాక్ మార్కెట్
1 min readముంబయి వెబ్ ; దేశీయ ద్రవ్యోల్బణం స్టాక్ మార్కెట్ ను నష్టాల్లోకి నెట్టింది. శుక్రవారం వెలువడిన రెండు ఆర్థిక గణాంకాలు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. దీంతో సోమవారం స్టాక్ మార్కెట్ నష్టాలతో ప్రారంభమయ్యింది. 11.50 నిమిషాల సమయంలో నిఫ్టీ- 243 పాయింట్లు నష్టపోయి..14747 వద్ద ట్రేడవుతుండగా, బ్యాంక్ నిఫ్టీ 980 పాయింట్లు నష్టపోయి… 34515 వద్ద ట్రేడవుతోంది. బ్యాంక్ నిఫ్టీకి 34500 కీలక సపోర్ట్ గా భావించవచ్చు. ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయితే.. మరింత డౌన్ అయ్యే ప్రమాదం ఉంది. శుక్రవారం వెలువడిన ఆహార ధాన్యాల ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి డాట స్టాక్ మార్కెట్లను దెబ్బతీశాయి. డిసెంబరులో సానుకూలంగా ఉన్న పారిశ్రామికోత్పత్తి .. జనవరి నెలలో ప్రతికూలంగా మారింది. దీంతో పాటు ఆహార ధాన్యాల ద్రవ్యల్భణం కూడ మార్కెట్ సెంటిమెంట్ నె దెబ్బతీశారు. ఫిబ్రవరిలో స్టాక్ మార్కెట్ లో మైదలైన నష్టాలు…మార్చి నెలలో కూడ కొనసాగే అవకాశం కనిపిస్తోంది.