NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్టాక్ మార్కెట్.. స‌రికొత్త రికార్డు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: భార‌త స్టాక్ మార్కెట్ సూచీలు స‌రికొత్త రికార్డులు నెల‌కొల్పాయి. అంత‌ర్జాతీయంగా సానుకూల సంకేతాల‌తో నాలుగో రోజు కూడ బుల్ జోరు కొన‌సాగింది. సెన్సెక్స్, నిఫ్టీలు ఆల్ టైం హై వ‌ద్ద కొత్త రికార్డులు న‌మోదు చేశాయి. ఐటీ రంగంలో కొనుగోళ్లతో స్టాక్ మార్కెట్లో బుల్ జోష్ క‌నిపించింది. సెన్సెక్స్ 254 పాయింట్ల లాభంతో 53,158 వ‌ద్ద స్థిర‌ప‌డింది. నిఫ్టీ 70 పాయింట్లు లాభ‌ప‌డి 15,924 వ‌ద్ద స్థిర‌ప‌డింది. నిఫ్టీ మొద‌టి సారి 15,900 స్థాయి పైన క్లోజ్ అయింది. ఉద‌యం లాభాల‌తో ప్రారంభ‌మైన స్టాక్ మార్కెట్ రోజంతా అదే జోరు కొన‌సాగించింది. రియాల్టీ, ఐటీ రంగ షేర్లు రాణించాయి. బ్యాంకింగ్, ఆటో, ఫార్మా, మీడియా ఇండెక్స్ లు స్వల్ప న‌ష్టాల‌ను న‌మోదు చేశాయి.

About Author