స్టాక్ మార్కెట్.. కొత్త రికార్డులు !
1 min readపల్లెవెలుగు వెబ్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి కొత్త గరిష్ఠాలను చేరాయి. రికార్డులను బ్రేక్ చేశాయి. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల నుంచి సానుకూల పరిణామాలతో సూచీలు బుల్ రన్ కొనసాగించాయి. అమెరికా ఫెడ్ రేట్లు మారకపోవచ్చన్న అంచనాలు, చైనా ఎవర్ గ్రేడ్ సంస్థ వివరణతో మార్కెట్లో బుల్ పరుగులు పెట్టింది. సెన్సెక్స్ 958 పాయింట్ల లాభంతో 59,885 వద్ద ముగిసింది. నిఫ్టీ 276 పాయింట్లు లాభపడి 17,823 వద్ద ట్రేడింగ్ ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 827 పాయింట్ల లాభంతో 37,771 వద్ద ముగిసింది.