NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వ‌రుస న‌ష్టాల నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్

1 min read

పల్లెవెలుగు వెబ్​: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వ‌రుస న‌ష్టాల నుంచి కోలుకున్నాయి. అంత‌ర్జాతీయంగా సానుకూల సంకేతాలు…అమెరికా, ఐరోపా, ఆసియా మార్కెట్లు కూడ సానుకూలంగా ట్రేడ్ అయ్యాయి. ఈ నేప‌థ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కూడ లాభాల్లో కొన‌సాగాయి. ఐటీ, ఆర్థిక రంగ షేర్లలో కొనుగోళ్లతో గ‌త రెండు రోజుల బేరిష్ మార్కెట్ కు స్వస్తి ప‌లికిన‌ట్టయింది. దీర్ఘకాలంలో ఇండియ‌న్ మార్కెట్లు బుల్లిష్ గా ఉంటాయ‌ని నిపుణులు అంచ‌నా వేసిన నేప‌థ్యంలో సూచీలు సానుకూలంగా క‌దిలాయి. సెన్సెక్స్ 831 పాయింట్ల లాభంతో 60138 వ‌ద్ద ట్రేడింగ్ ముగించింది. నిఫ్టీ 250 పాయింట్ల లాభంతో 17929 వ‌ద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 638 పాయింట్ల లాభంతో 39763 వ‌ద్ద ట్రేడింగ్ ముగించింది.

About Author