NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

1 min read

– ఆర్బీఐ నిర్ణయంతో జోష్

ముంబ‌యి: స్టాక్​ మార్కెట్ లాభాల బాట ప‌ట్టింది. ఉద‌యం స్వల్ప న‌ష్టంతో ప్రారంభ‌మై.. లాభాల్లోకి వెళ్లింది. అంత‌ర్జాతీయ మార్కెట్లో సానుకూల ఫ‌లితాల కార‌ణంగా మ‌న ఇండెక్స్ లు కూడ సానుకూలంగా స్పందించాయి. ఆర్బీఐ నిర్ణయం మీద దృష్టి సారించిన ఇన్వెస్టర్లు.. వ‌డ్డీ రేట్లు య‌థాత‌థంగా ఉంచుతామ‌న్న ప్రక‌ట‌న త‌ర్వత మార్కెట్లో మ‌రింతో జోష్ క‌నిపించింది. ప్రస్తుత ప‌రిస్థితుల‌కు అనుగుణంగా నిర్ణయాలుంటాయ‌ని ఆర్బీఐ ప్రక‌టించింది. ఈ నేప‌థ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోలుకు మొగ్గుచూపారు. ఆర్బీఐ నిర్ణయం వెలువ‌డిన త‌ర్వత మార్కెట్ ను ప‌రిశీలిస్తే… నిఫ్టీ- 165 పాయింట్ల భారీ లాభంతో ట్రేడ్ అవుతుండ‌గా.. కీల‌క బ్యాంక్ నిఫ్టీ- 422 పాయింట్ల లాభంతో ట్రేడ‌వుతోంది. కంపెనీల త్రైమాసిక ఫలితాలు క‌నుక అనుకూలంగా ఉంటే మార్కెట్లో మరింత జోష్ పెరుగుతుంది.

About Author