లాభాల దిశగా స్టాక్ మార్కెట్లు
1 min readముంబయి : ఇటీవల నష్టాలతో ట్రేడ్ అవుతున్న ఇండెక్స్ లు ఈ రోజు లాభాల్లో కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం 10.45 నిమిషాల సమయంలో నిఫ్టీ 50.. 44 పాయింట్లు లాభాల్లో ఉండగా, సెన్సెక్స్… 0.33% లాభంలో కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ.. 44 పాయింట్ల లాభంతో ఫ్లాట్ గా కొనసాగుతోంది. అయితే.. అంతర్జాతీయ సూచీల మార్గంలో మన ఇండియన్ మార్కెట్లు ముందుకువెళ్తున్నాయి. నిన్న అమెరికన్ మార్కెట్లు లాభాల బాట పట్టడంతో.. అదే మార్గాన్ని దేశీయ మార్కెట్లు అనుసరించాయి. కరోనా నేపథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్టం కోసం ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అక్కడి మార్కెట్లు లాభాల బాట పట్టాయి. అదే మార్గాన్ని ఆసియా మార్కెట్లు కూడ అనుసరించాయి. అయితే.. ఈ లాభాల ట్రెండ్ ఎంత వరక కొనసాగుతుందనే…అనుమానం ఇన్వెస్టర్లలో ఉంది. నిఫ్టీ 50 లో బ్యాంక్ నిఫ్టీ వెయిట్ చాలా కీలకం. అయితే.. బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం ప్లాట్ గా పాజిటివ్ ట్రెండ్ లో కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ ఏమాత్రం నెగిటివ్ జోన్ లోకి స్లిప్ అయినా.. నిఫ్టీ 50 నష్టాల్లో వెళ్లే ప్రమాదం ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.