చంద్రబాబు సభపై రాళ్ల దాడి దారుణం..
1 min read– ఆయనకు ఏమైనా జరిగితే.. రాష్ట్రం అగ్నిగుండమే..
– అమీర్ బాబు, రెడ్యం
పల్లెవెలుగు వెబ్, కడప: మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సభలో రాళ్లదాడి చేయడం దారుణమని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, కడప నియోజకవర్గ బాధ్యులు విఎస్ అమీర్‌బాబు అన్నారు. 14 ఏళ్ల పరిపాలించిన చంద్రబాబు హయాంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండేదని గుర్తు చేశారు. మంగళవారం కడప నగరంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద తెదేపా బాధ్యులు వి ఎస్ అమీర్ బాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అమీర్ బాబు, రెడ్యం లు మాట్లాడుతూ సీఎం జగన్ పాదయాత్ర చేసిన సమయంలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు వారికి పూర్తి రక్షణ కల్పించారని, ఎక్కడా దాడి చేయించలేదన్నారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు సభపై రాళ్లదాడి చేయడం పిరికిపంద చర్యగా వారు అభివర్ణించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. నిరసన కార్యక్రమంలో తెదేపా నేతలు అన్వర్ హుస్సేన్, సానపురెడ్డి శివకొండారెడ్డి, ఆమూరిబాల దాసు, జలతోటి జయకుమార్, సుధాకర్ యాదవ్, తేదేపా బీసీ జిల్లా నాయకులు నభీకోట శ్రీనివాసులు, జనార్దన్ రెడ్డి, సుబ్బరాయుడుయాదవ్, బండి జయశేఖర్, విశ్వనాధ్, ఓబులేసు, నాసర్ ఆలీ తదితరులు పాల్గొన్నారు.