PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యదుత్పత్తిని నిలిపివేయించండి.! కేఆర్​ఎంబీకి ఏపీ లేఖ

1 min read

పల్లెవెలుగువెబ్​, అమరావతి: కృష్ణాజలాల వినియోగ వ్యవహారంలో తెలుగురాష్ట్రాల మధ్య జలవివాదం కొనసాగుతోంది. ఈక్రమంలో తాజాగా శ్రీశైలం, నాగార్జునసాగర్​ ప్రపాజ్జెక్టుల్లో తెలంగాణ చేపడుతోన్న విద్యుదుత్పత్తిని నిలిపివేయించాలని ఏపీ ప్రభుత్వం కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డుకు గురువారం లేఖ రాసింది. ఏన్నిసార్లు ఫిర్యాదులు చేసినా తెలంగాణ మొండి వైఖరితో రెండు ప్రాజ్జెక్టుల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ కృష్ణాజలాలను దుర్వినియోగం చేస్తోందని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటివరకు టి.సర్కార్​ వినియోగించిన 110టీఏంసీల నీటిని ఆ రాష్ట్రా వాటాలో కలపాలని కోరింది. కేఆర్​ఎంబీ ఆదేశాలను సైతం ఉల్లంఘిస్తూ తెలంగాణ అనుసరిస్తోన్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వెంటనే శ్రీశైలం, నాగార్జునసాగర్​ ప్రాజ్జెక్టుల నుంచి విద్యుదుత్పత్తి ద్వారా తెలంగాణ పాల్పడుతోన్న కృష్ణాజలాల దుర్వినియోగాన్ని నియంత్రించాలని ఏపీ కేఆర్​ఎంబీకి రాసిన లేఖలో కోరింది.

About Author