PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉద్యమాన్ని ఆపగలిగితే ఆపండి !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఏపీ మంత్రులు ఉద్యోగుల ఉద్యమాన్ని ఆపగలిగితే ఆపాలని ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి అన్నారు. వేరే ఉద్యోగ సంఘాలతో మాట్లాడి ఈ ఉద్యమాన్ని ఆపగలం అనుకుంటే ఆపండని హెచ్చరించారు. పాత జీతమే ఇవ్వాలని ఇప్పటికే మంత్రుల కమిటీని కోరినట్లు సచివాలయం ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి తెలిపారు. మంత్రులతో చర్చలకు తాము బిగుసుకు కూర్చుకున్నామనడం సరికాదన్నారు. ఎవరు వెళ్లి చెప్పినా ఇదే విషయం చెబుతామని, సానుకూలంగా స్పందన వస్తే చూస్తామని చెప్పారు. ఈ నెల కూడా పాత జీతమే అడిగినట్లు వెంకట్రామిరెడ్డి తెలిపారు.

    

About Author