ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని ఆపండి: RYSF
1 min readపల్లెవెలుగు వెబ్: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని మండల రెవెన్యూ అధికారికి రాయలసీమ యువ విద్యార్థి సమాఖ్య ఆర్. వై. ఎస్. ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు కలసి పాఠశాలల విలీనంపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం తాలూకా అధ్యక్షుడు రాముడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3,4,5 తరగతుల విలీన ప్రక్రియను వెంటనే ఆపాలని డిమాండ్ చేయడం జరిగింది.పాఠశాలల విలీన పద్ధతి వలన రాష్ట్రంలో చదువుకుంటున్న లక్షలాది మంది పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉందని అన్నారు. దీనివలన సామాన్యుడు ఉన్నత చదువులు చదువుకోవాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. కావున ప్రభుత్వం పునరాలోచన చేసి పేద విద్యార్థులకు గొడ్డలి పెట్టుగా ఉన్నటువంటి 117, 85, 84 జీవోలను వెంటనే రద్దు చేయాలని అన్నారు. లేనిపక్షంలో పేద విద్యార్థుల సంక్షేమం కోసం రాయలసీమ యువ విద్యార్థి సమాఖ్య ఆర్. వై. ఎస్. ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా మండల రెవెన్యూ అధికారి సానుకూలంగా స్పందించి పేద విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ముందుకు వెళతామని ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు: పూర్ణ, శివ, రఫిక్, మహేష్,గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.