ఆ ప్రకటన ఆపండి.. యూట్యూబ్ కు కోర్టు ఆదేశం !
1 min readపల్లెవెలుగు వెబ్:ఆర్టీసీ బస్సు సర్వీసులను కించపరిచేలా అల్లుఅర్జున్ తో ర్యాపిడో సంస్థ రూపొందించిన యాడ్ ను తొలగించాలని కోర్టు ఆదేశించినట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ర్యాపిడో సేవల్ని ఉత్తమమైననవిగా చెప్పుకునే క్రమంలో ఆర్టీసీ సేవల్ని ఈ యాడ్ లో తక్కువ చేసి చూపించడాన్ని ఆర్టీసీ తప్పుపట్టింది. యూట్యూబ్ నుంచి ఈ యాడ్ ను తొలగించాలని నాంపల్లి సిటి సివిల్ కోర్టు ఆదేశించినట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ర్యాపిడో సంస్థకు పరువు నష్టం దావా హెచ్చరికలతో పాటు అల్లు అర్జున్ కు నోటీసులు పంపారు. అయినా కూడ సంస్థ తమ ప్రకటన ఆపకపోవడంతో ఆర్టీసీ కోర్టును ఆశ్రయించింది.