NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆగిపోయిన డ్రైనేజీ పనులు

1 min read

పల్లెవెలుగు వెబ్​, చెన్నూరు: మండల కేంద్రమైన చెన్నూరు కొత్త రోడ్డు నుంచి మెయిన్ రోడ్డు డ్రైనేజీ సిమెంట్ రోడ్డు పనులకు గురువారం మరోసారి బ్రేక్ పడింది. రెండు రోజుల కిందట డ్రైనేజీ పనులు చేపడుతుండగా త్రాగునీటి పైప్ లైన్లు. కేబుల్ వైర్లు ఉండిపోవడంతో డ్రైనేజీ పనులు నిలుపుదల చేయాలంటూ పలువురు అడ్డు తగలడంతో నిలిపివేశారు. తిరిగి గురువారం డ్రైనేజీ పనులు చేపడుతుండగా ఉన్నపలంగా తెలుగుదేశం పార్టీ వైయస్సార్సీపి లో ఉన్న అయ్యా పార్టీ నాయకులు డ్రైనేజీ పనులు నిలుపుదల చేయాలని అడ్డు తగలారు దీంతో మరోసారి డ్రైనేజీ పనులు నిలిచిపోయాయి. అధికారుల సమన్వయ లోపం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని పలువురు విమర్శిస్తున్నారు. రోడ్డు వెడల్పు చేయకపోవడం ఇరువైపులా ఆక్రమణలు తొలగించకపోవడం ఈ పరిస్థితి కారణమని అంటున్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న డ్రైనేజీ ప్రాంతంలో త్రాగునీటి పైపులైన్లు కేబుల్ వైర్లు ఉన్న కారణంగా మరో ప్రక్క ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవిన్యూ అధికారులు అటువైపు రాకపోవడం చర్చిన అంశంగా మారింది.. రెవెన్యూ గ్రామపంచాయతీ జోక్యం చేసుకుంటే సమస్య పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి. డ్రైనేజీ పనులు నిలిచిపోవడం పలువురు తెలుగుదేశం పార్టీకి చెందిన అలాగే వైసిపి పార్టీకి చెందినవారు మండల తాసిల్దార్ ఎంపీడీవోలకు ఫిర్యాదు చేశారు.

About Author