NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆగిపోయిన షూటింగ్..?

1 min read

నికిల్ హీరోగా న‌టిస్తున్న చిత్రం ‘కార్తికేయ‌-2’. 2014లో విడుద‌ల‌యిన ‘కార్తికేయ‌’ సినిమాకి ఇది సీక్వెల్. నికిల్ స‌ర‌స‌న అనుప‌మ ప‌ర‌మేశ్వర‌న్ న‌టిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మిస్తున్న ‘కార్తికేయ‌-2 ’ చిత్రానికి చందూ మొండేటి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. కాలబైర‌వ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ వివిధ లొకేష‌న్లలో శ‌రవేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. సినిమా షూటింగ్ ఇటీవ‌ల గుజ‌రాత్ లో ఒక షెడ్యూల్ పూర్తీ చేసుకుంది. అనంత‌రం హిమాచ‌ల్ ప్రదేశ్ లో సినిమా షూటింగ్ ప్రారంభించారు. అయితే.. అక్కడ మంచు తీవ్రంగా కురుస్తున్న నేప‌థ్యంలో షూటింగ్ కు అంత‌రాయం ఏర్పడింది. ప‌రిస్థితులు అనూకూలంగా లేని కార‌ణంగా షూటింగ్ నిలిపివేస్తున్నట్టు, మ‌రొక లొకేష‌న్లో త్వర‌లో ఓ యాక్షన్ సీన్ షూటింగ్ చేస్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది.

About Author