విద్యుత్ ఉత్పత్తి ఆపడం ఎవరి తరం కాదు : టీ. మినిష్టర్
1 min readపల్లెవెలుగు వెబ్: సాగునీటి అవసరాలు తీరిన తర్వాతే.. విద్యుత్ ఉత్పత్తి చేయాలని, ఇష్టానుసారం చేస్తే కేఆర్బీఎం ఎందుకుని ఏపీ మంత్రులు చేసిన వ్యాఖ్యల పై తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. విద్యుత్ ఉత్పత్తి ఆపే హక్కు ఎవరికీ లేదన్నారు. జూరాల, నాగార్జున సాగర్, పులిచింతల, శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి తెలంగాణ హక్కు అని, ఎవరో ఆర్డరిస్తే మేం వినాల్సిన అవసరం లేదని అన్నారు. కృష్ణా నదిలో తమ వాటా ఎంతో తమకు తెలుసని చెప్పారు. గతంలో చేసిన తప్పులను ఏపీ మంత్రులు చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో వంద శాతం సామర్థ్యంతో జల విద్యుత్ ఉత్పత్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో విద్యుత్ శాఖ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకున్నారన్నారు.