కార్తీకమాస రద్దీ రోజులలో స్వామివార్ల స్పర్శదర్శనం నిలుపుదల
1 min readడిసెంబరు 12తో ముగియనున్న కార్తీకమాసోత్సవాలు
ఈ నెల 26న కృష్ణమ్మకు హారతి జ్వాలాతోరణం మరియు లక్షదీపోత్సవం- పుష్కరిణిహారతి
27వ తేదీన సోమవారం సందర్భంగా లక్షదీపోత్సవం- పుష్కరిణిహారతి
పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: రద్దీ రోజుల్లో స్వామివారి అమ్మవార్ల భక్తులు త్వరగా దర్శించుకోవాలని స్పర్శ దర్శనం నిలుపుదల చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులుఅలంకార దర్శనానికి అవకాశం కల్పించారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కార్తీకమాసం మొత్తం. గర్భాలయ అభిషేకములు మరియు సామూహిక అభిషేకములు రద్దు చేసిన ఆలయ అధికారులుమంగళ బుదుగురు శుక్రవారం లోస్పర్శదర్శనం ఇతర ఆర్జితసేవాటికెట్లు ఆన్లైన్లో అందుబాటు. అందుబాటులో ఉంచారు స్పర్శదర్శనం టికెట్లుగంట ముందు వరకు కూడా ఆన్లైన్లో పొందే అవకాశం ఆలయ అధికారులు కల్పించారు. భక్తల సౌకర్యార్థం ఆలయ అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా భక్తులకు వసతి, మంచినీటి సరఫరా, సౌకర్యవంతమైన దర్శనం, ప్రసాదాల విక్రయం, అన్నప్రసాదాల వితరణ, పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించడం జరుగుతుంది .ఈ నెల 26, ఆదివారంనాటి మధ్యాహ్నానికే పౌర్ణమి ఘడియలు రావడంతోనూ మరియు ఆ మరుసటిరోజైన సోమవారం రోజున మధ్యాహ్నం వరకు మాత్రమే పౌర్ణమి ఘడియలు ఉన్న కారణంగా సంప్రదాయాన్ని అనుసరించి ఆదివారం రోజుననే అనగా 26వ తేదీ సాయంకాలం పాతాళగంగ వద్ద పుణ్యనదీహారతి, ఆలయ ప్రధానద్వారం ఎదురుగా గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణం మరియు పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం పుష్కరిణి హారతి కార్యక్రమాలు ఆలయ అర్చకులు నిర్వహిస్తున్నారు. శని, ఆది, సోమవారాలలో రూ.500/-ల దర్శనం టికెట్లు అందుబాటులో ఉంచారు. ఈ టికెట్లను భక్తులు ఆన్లైన్ తోపాటు కరెంట్ బుకింగ్ ద్వారా కూడా భక్తులుపొందవచ్చు. అయితే ఈ రూ. 500/-ల టికెట్లకు కూడా కేవలం స్వామివార్ల అలంకార దర్శనం మాత్రమే కల్పించబడుతుంది. కార్తీకమాసంలో ఉచిత సర్వదర్శనం కూడా యథావిధిగా కొనసాగుతుంది. ఆలయ అధికారులు తెలియజేశారు.