బీహార్ లో విన్న కథలు.. ఏపీలో చూస్తున్నాం !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీలో జగన్ పాలన ఆటవికంగా మారుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శైలజానాథ్ ఆరోపించారు. పోలీస్ కట్టుకథలు మరింత విస్మయానికి గురి చేస్తున్నాయన్నారు. బిహార్‌లో విన్న కథలు.. ఏపీలో ప్రత్యక్షంగా చూస్తున్నామన్నారు. దళిత బిడ్డలను చంపినా.. కొట్టినా పట్టించుకోలేదన్నారు. ఏపీని అప్పుల ప్రదేశ్‌గా మార్చిన ఘనత జగన్‌దేనని శైలజానాథ్ పేర్కొన్నారు. సలహాదారులకు లక్షల జీతాలు ఇచ్చి మేపుతున్నారన్నారు. వారితో రాష్ట్రానికి, సమాజానికి ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. ప్రభుత్వాస్తులను అమ్మడం, అప్పగించడమే జగన్ పని అన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా జగన్ పాలన నిర్వహిస్తున్నారని శైలజానాథ్ పేర్కొన్నారు.