PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీకి తుఫాను ముప్పు.. ఏ జిల్లాల‌కో తెలుసా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తుఫాను ముప్పు పొంచి ఉంది. 24 గంటల్లో మరో వాయుగుండం తప్పేలా లేదు.. ఇప్పటికే వరుస వాయుడుగండాలతో ఏపీ తడిసి ముద్దవుతోంది. మరో వాయుగుండం తాకనుందనే సమాచారం ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజలను మరింత వణికిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని జలాశయాలు అవసరానికి మించి ప్రవహిస్తున్నాయి. పంటపొలాలు నీటిలోనే నానుతున్నాయి. ఎక్కడ చూసిన వర్షం నీరే కనిపిస్తోంది. తాజాగా మరో వాయుగుండం ప్రభావంతో 48 గంటల్లో భారీ వర్షాలు పడనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఒడిసా తీరానికి దగ్గరలో వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిసాతీరాలకు దగ్గరలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా ఒంపు తిరిగి ఉందని, దీని ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.ఇప్పటికే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్ర, శని, ఆదివారాల్లో కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఇక మరో మూడు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో.. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనంతపురం, కడప, చిత్తూరు, గుంటూరు జిల్లాలతోపాటు శ్రీకాకుళం జిల్లాలోనూ కొన్ని చోట్ల భారీ, అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

                                          

About Author