వీధి కుక్కలు స్వైర విహారం … పట్టించుకోని మున్సిపల్ కమీషనర్
1 min read– మాజీ ఎమ్మెల్యే డా బి వి జయనాగేశ్వర రెడ్డి
– తిరుమలలో పులులు వస్తే కర్రలు పట్టిస్తున్నారు. ఎమ్మిగనూరు లో కుక్కలు వస్తే రాళ్లు పట్టిస్తారా ? :- మాజీ ఎమ్మెల్యే డా బి వి జయనాగేశ్వర రెడ్డి
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు, రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు గౌ శ్రీ డా బి వి జయనాగేశ్వర రెడ్డిస్థానిక ఎమ్మిగనూరు పట్టణంలోని 16వ వార్డు యందు నిన్నటి రోజున కుక్కల దాడిలో గాయపడిన బోయ పార సంగీత అనే చిన్నారిని ఎమ్మిగనూరు పట్టణ టిడిపి నాయకులతో కలిసి పరామర్శించి చిన్నారి ఆరోగ్య పరిస్థితి గురించి వారి కుటుంబ సభ్యులకు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ….. ఎమ్మిగనూరు పట్టణంలో కుక్కలను కూడా నివారించలేని చేతకాని మున్సిపల్ కమీషనర్ గంగిరెడ్డి అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మూగజీవాలను తానూ చంపమని చెప్పడం లేదని వాటిని పట్టుకొని తగిన చర్యలు తీసుకొని ఎమ్మిగనూరు పట్టణ ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతున్నామని పేర్కొన్నారు. ఎమ్మిగనూరు పట్టణంలో ఎక్కడ చుసిన రోడ్లకు అడ్డముగా పశువులు, కుక్కలు స్వైర విహారం చేస్తూ చిన్నారులు, పాదచారులపై దాడులు చేస్తున్న మున్సిపల్ కమీషనర్ గంగిరెడ్డి నిమ్మకునీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మిగనూరు మున్సిపల్ కమీషనర్ గంగిరెడ్డి పాలన మరచి వైసిపి తొత్తుగా వ్యవహరిస్తూ, రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒకవేళ కమీషనర్ గంగిరెడ్డి గారికి పార్టీ అంటే మక్కువ ఉంటె కండువా కప్పుకొని కౌన్సిలర్ గా వైసిపి తరపున పోటీచేయాలని హితవు పలికారు. గ్రేడ్ 1మున్సిపాలిటీని అవినీతి మున్సిపాలిటీగా మార్చి ఈరోజు ఎమ్మిగనూరు పట్టణంలో కనీసం కుక్కలను కూడా నియంత్రించలేని దయనీయ స్థితికి ఎమ్మిగనూరు మున్సిపాలిటీని దిగజార్చిన ఘనత వైసిపి నాయకులు మున్సిపల్ అధికారులకు దక్కిందని పేర్కొన్నారు. కమీషనర్ ఛాంబర్ ను రియల్ ఎస్టేట్ దందాలు, వ్యాపారాలకు అడ్డాగా మార్చారని మండిపడ్డారు. మున్సిపల్ కమీషనర్ గంగిరెడ్డి గారు రాబోవు రోజులలో ఎక్కడ ఉన్న ఆయన అవినీతి చిట్టా మొత్తం బయటకు తీసి తగిన చర్యలు తీసుకునే వరకు నిద్రపోమని పేర్కొన్నారు. స్థానిక వైసిపి శాసన సభ్యులు చెన్నకేశవ రెడ్డి కి చిత్తశుద్ధి ఉంటె కమీషనర్ గంగిరెడ్డి లాంటి వారిని వెంటనే సస్పెండ్ చేయాలని పేర్కొన్నారు. తానూ వైసిపి శాసన సభ్యులకు, వైసిపి నాయకులకు మాత్రమే కమీషనర్ కాదు ఎమ్మిగనూరు పట్టణ ప్రజలందరికి కమీషనర్ అనే విషయాన్ని కమీషనర్ గంగిరెడ్డి గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.