బీజేపీని.. గ్రామస్థాయిలో బలోపేతం చేయండి
1 min readమండల అధ్యక్షులకు దిశానిర్ధేశం ఇచ్చిన బీవీ సుబ్బారెడ్డి
పల్లెవెలుగు:భారతీయ జనతా పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతికార్యకర్త, నాయకుడిపై ఉందన్నారు బనగానపల్లె బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ బి.వి. సుబ్బారెడ్డి. మంగళవారం బనగానపల్లెలోని బివి సుబ్బారెడ్డి ఫంక్షన్ హాల్ నందు మండల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీవీ సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నీ గ్రామ స్థాయి నుండీ బలోపేతం చేయాలని అలాగే పోలింగ్ బూత్ కమిటీలు త్వరగా పూర్తీ చేయాలని మండల అధ్యక్షులు మండల ప్రధాన కార్యదర్శి లకు మార్గ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి శివ కృష్ణ యాదవ్ కిసాన్ మోర్చ జిల్లా ఉపాధ్యక్షడు శివరామిరడ్డి బనగానపల్లి మండల అధ్యక్షులు యాదగిరి అవుకు మండల అధ్యక్షులు కంభం వేంకటేశ్వర్లు కొలిమిగుండ్ల మండల అధ్యక్షులు రామసుబ్బాయ్య కోవెలకుంట్ల మండల అధ్యక్షులు రవితేజా రెడ్డి సంజామాల మండల అధ్యక్షులు చిన్నయ్య యాదవ్ బిజెపి సీనియర్ నాయకులు మైనార్టీ నాయకులు సయ్యిద్ జహిద్.ప్రధాన కార్యదర్శి లు రవి కుమార్ యాదవ్ రాముడు నాయక్ వేంకట శివా రెడ్డి హుసేనయ్య నాగార్జున తదితరులు పాల్గొన్నారు. అలాగె నుతానంగా అవుకు మండల పరిధిలోని సనుగొండ్ల గ్రామ రైతు మాళ్లు వేంకట రెడ్డి గారు బిజెపి లో చేరారు వారికి బీవీ సుబ్బారెడ్డి గారు కండువా కప్పి పార్టలోకి ఆహ్వానించారు.