హెచ్చు, తగ్గుల నడుమ ఒత్తిడి.. నష్టాల్లో సూచీలు !
1 min readపల్లెవెలుగువెబ్ : బడ్జెట్ బూస్ట్ తో వరుసగా మూడు రోజులు లాభాల్లో పయనించిన సూచీలు.. నాలుగో రోజు నష్టాల బాట పట్టాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, ఇతర గ్లోబల్ అంశాలు మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతీశాయి. ప్రధానంగా ఐటీ, రియాల్టీ, క్యాపిటల్ గూడ్స్ సెక్టార్లు నష్టాలకు కారణమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ 580 పాయింట్ల నష్టంతో 58977 వద్ద, నిఫ్టీ 167 పాయింట్ల నష్టంతో 17612 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 143 పాయింట్ల నష్టంతో 39187 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.