PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇన్సూరెన్స్ పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు

1 min read

: రాయచోటి టాఫిక్ ఎస్ఐ ఎన్.యం.డి.రఫీ

పల్లెవెలుగు  వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో:  ఇన్సూరెన్సు పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని రాయచోటి ట్రాఫిక్ ఎస్ఐ ఎన్.యం.డి.రఫీ హెచ్చరించారు. బుధవారం రాయచోటి పట్టణంలోని వివిధ ప్రాంతాలల్లో అన్నమయ్య జిల్లా ఎస్పీ గంగాధర్ రావు ఆదేశాల మేరకు డీఎస్పీ మహబూబ్ బాషా సారథ్యంలో రాయచోటి అర్భన్ సీఐ సుధాకర్ రెడ్డి ఉత్తర్వులు మేరకు రాయచోటి ట్రాఫిక్ ఎస్ఐ ఎన్.యం.డి.రఫీ, జిల్లా స్పెషల్ పార్టీ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు కలిసి ముమ్మరంగా తనిఖీలు చేపట్టి ఇన్సూరెన్స్ పత్రాలు లేకుండా తిరుగుతున్న సుమారు 30 ఆటోలను గుర్తించి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సంధర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ ఎన్.యం.డి.రఫీ ఆటో డ్రైవర్లుతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో చాలా వరకు ఆటోలు వల్ల ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగాయని, ఇందులో ముఖ్యంగా ఆటోలకు ఇన్సూరెన్స్ పత్రాలు లేకపోవడంతో ఎంతో మంది రోడ్డు ప్రమాదాల బాధితులకు ఎట్టు వంటి లబ్ది(ఇన్సూరెన్స్) రాకపోవడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్క వాహనదారుడు తప్పని సరిగా ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలన్నారు. ఇకమీదట ఎవరైనా తమ వాహానాలకు ఇన్సూరెన్స్ పత్రాలు లేకుండా వాహనాలను రోడ్ల పైకి తీసుకొస్తే జప్తు చేస్తామని ట్రాఫిక్ ఎస్ఐ తెలిపారు. మద్యం సేవించి వాహనాలను నడిపి రోడ్డు ప్రమాదాలకు కారణమైతే డ్రైవర్ల పై చట్టపరమైన కఠిన చర్యలు చేపట్టి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు జైలు కు పంపుతామని ఆయన హెచ్చరించారు. ఆటో డ్రైవర్లు ఎక్కువ సౌండ్ వచ్చే హారన్లు, స్పీకర్లు, డక్కులు, ఆటోకు ఉన్న అద్దాలు కనిపించకుండా స్టిక్కర్లు అట్టించడం, ఆటోలు పై చెడుగా ప్రేరేపించే రాతలు రాయడం వంటివి చేయరాదని సూచించారు. అనంతరం ఆటో డ్రైవర్లు కు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ జోసఫ్ ,పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author