వాటర్ ట్యాంకి పడగొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
1 min readవిద్యార్థి ప్రజా సంఘాలు..
పల్లెవెలుగు వెబ్ పాణ్యం: పాణ్యం మండల కేంద్రంలో బస్టాండ్ నందు బీసీ కాలనీలో వాటర్ ట్యాంక్. పక్కల ఉన్న స్థల యజమాని స్థలం ఆక్రమించుకోవడానికి 20 ఏళ్ల నుండి ఉన్న ఉపయోగంలో ఉన్న చిన్న వాటర్ ట్యాంక్ ని పడగొట్టిన యజమానిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పాణ్యం ఎస్సై అశోక్ కు తహసిల్దార్ ఫణికుమార్ కు సిఐటియు డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి కె భాస్కర్ మాట్లాడుతూ రాబోయేది వేసవికాలం నీటికి. ఇబ్బంది పడుతు ఐదు రోజులుగా త్రాగుటకు నీరులేక అవస్థలుపడుతున్నారన్నారు. పశువులకు నీరు లేక దూర భారం నుండి తెచ్చుకుంటున్నాము ఆ వాటర్ ట్యాంక్ నుండి 200 కుటుంబాల ప్రజలు నీటిని ఉపయోగిస్తారు.కావున వెంటనే. ఈవో సర్పంచ్ స్పందించి ఉన్న చోటే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు లేకపోతే కాలనీవాసుల ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం దగ్గర ఆందోళన చేసారు.అనంతరం పంచాయితే వారు ఇప్పటికిప్పుడు వాటర్ ట్యాంక్ నిర్మించేవరకు ట్యాంక్ లతో తెచ్చి ప్రజలకు త్రాగుటకు నీరు తెప్పిస్తున్నామని చెప్పారు . ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా నాయకులు శివ, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు ప్రతాప్, మురళి, అక్బర్ బాషా. ఖాదర్బాషా. స్థానిక మహిళలు ఈవో గారిని ముట్టడించి. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.