ప్రగతి కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు పై కఠిన చర్యలు తీసుకోవాలి
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/5-6.jpg?fit=550%2C335&ssl=1)
ఆర్పీ ఎస్ ఎఫ్, ఆర్యు ఎస్ ఎఫ్
పల్లెవెలుగు వెబ్ న్యూస్ ఎమ్మిగనూరు: పట్టణంలో ప్రగతి కోచింగ్ సెంటర్ ను సీజ్ చేయాలని ఎమ్మిగనూర్ డిప్యూటీ తాసిల్దార్ గకి ఆర్ యు ఎస్ఎఫ్, ఆర్ పి ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ పి ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షాహిద్ ఆఫ్రిది,ఆర్ యు ఎస్ ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునాథ్ మాట్లాడుతూ ఎమ్మినూరు పట్టణంలో ఉన్న ప్రగతి కోచింగ్ సెంటర్ లో డీఎస్సీ కోచింగ్ పేరిట నిరుద్యోగుల నుంచి వేలకు వేలు వసూలు చేస్తూ లక్షల కూడ కట్టుకుంటున్నాడని, కోచింగ్ సెంటర్లో మొదట జాయిన్ అయ్యే సమయంలో కేవలం ఆరు నెలలు కోచింగ్ మాత్రమే అని చెప్పి ఇప్పుడు పది నెలలు కావస్తున్న కోచింగ్ నిర్వహిస్తున్నారని నిరుద్యోగుల నుంచి ఇప్పటివరకు వేలాలనుంచి లక్షల వరకు దోచుకున్నాడని తెలిపారు. ప్రతి ఆదివారం టెస్టుల పేరిట నిరుద్యోగ నుంచి 3,000 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నాడని దీనిపై ప్రశ్నించిన నిరుద్యోగులను టెస్టుల రాయకుండా అడ్డుపడుతున్నారు మరియు అన్ని ఫీజులు కడుతున్న కూడా ఆ కోచింగ్ సెంటర్లో ఎటువంటి మౌలిక వసతులు లేవని కొన్ని వందల మంది నిరుద్యోగులు ను రేకులు షెడ్లో క్రింద ఇరుకు గదిలో కూర్చుబేడ్తున్నారు అని అన్నారు. ఇంత జరుగుతున్న విద్యాధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఇప్పటికైనా నిరుద్యోగలా నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నా ప్రగతి కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు పై కఠిన చర్యలు తీసుకోవాలని వారి డిమాండ్ చేశారు లేనిపక్షంలో ఈ సమస్య మరిన్ని ఉద్యమాలకు దారి తీస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో నాయకులు షైక్ష వలి, పవన్ తదితరులు పాల్గొన్నారు.