PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భూముల రీ సర్వే విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు

1 min read

– జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లాలో జరుగుతున్న భూముల రీ సర్వే కార్యక్రమంలో విధులు నిర్వహించే సిబ్బంది నిర్లక్ష్యం వహించితే వారిపై కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య సిబ్బందిని హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని రీ సర్వే డాటా ప్రాసెసింగ్ సెంటర్ ను జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య తనిఖీ చేశారు.జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న భూముల రిసర్వేను నిర్దేశిత సమయంలో పూర్తిచేయాలని సిబ్బందిని ఆదేశించారు.రీ సర్వే డాటా ప్రాసెసింగ్ వేగవంతం చేయాలని ప్రాసెసింగ్ చేయడంలో ఏమైనా సమస్యలుంటే వెంటనే నా దృష్టికి తేవాలని జాయింట్ కలెక్టర్ రీ సర్వే సిబ్బందిని ఆదేశించారు. సి బెల్లగల్లు మండలంలో ని గుండ్రేవుల, పలుకు దొడ్డి, బురాన్ దొడ్డి, పోలకలు, గ్రామాలలో సర్వే ప్రక్రియ మందకొడిగా జరుగుతుందని వేగం పెంచకపోతే ఆ మండలంలోని సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ సిబ్బందిని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో  ల్యాండ్ సర్వే ఏడి శ్రీ మోహన్,తహసిల్దారులు, డిప్యూటీ తహసిల్దార్లు డాటా ఎంట్రీ ఆపరేటర్లు, విలేజ్ సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.

About Author