పందులను తరలించకపోతే కఠిన చర్యలు తప్పవు
1 min read– పందుల యజమానులను హెచ్చరించిన సర్పంచ్, కార్యదర్శి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: చెన్నూరు గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న పందులను గ్రామాలకు దూరంగా పందుల యజమానులు తరలించకపోతే కఠిన చర్యలు తప్పవని సర్పంచ్ సిద్ది గారి వెంకటసుబ్బయ్య, కార్యదర్శి రామసుబ్బారెడ్డి, ఎంపీటీసీ ముదిరెడ్డి సుబ్బారెడ్డిలు హెచ్చరించారు. సోమవారం వారు స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, అందులో యజమానులు గ్రామాలలో పందులను విచ్చలవిడిగా వదలడంతో అవి ఇండ్లల్లో, అలాగే వీధులలో విచ్చలవిడిగా తిరగడం, ఇండ్లల్లో పరిసరాలలో, గలీజు చేస్తుండడంతో ప్రజలు ఎక్కడ రోగాలు ప్రభలు తాయోనని భయాందోళనతో గ్రామపంచాయతీకి అనేకసార్లు ఫిర్యాదు చేయడం జరిగింది అన్నారు, అంతేకాకుండా పొలాలలో రైతులకు సంబంధించిన పంటలను ధ్వంసం చేస్తున్నాయని అటు రైతులు కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు, దీంతో పందుల యజమానులను అటు గ్రామపంచాయతీ అధికారులు, ఇటు ఎస్ఐ శ్రీనివాసులు రెడ్డి అనేక పర్యాయాలు పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ వారి పద్ధతులు మార్చుకోక పోవడం, పందులను ఎదేచ్ఛగా ఊరి మీదికి వదలడం జరుగుతుందన్నారు, ఎన్నిసార్లు పందుల యజమానులకు చెప్పినప్పటికీ వారు ఈ విషయంలో జాప్యం చేస్తుండడంతో, వారికి మరోసారి ఒక అవకాశం ఇవ్వడం జరుగుతుందని రెండు, మూడు రోజులలో పందులను ఊరికి దూరంగా తరలించకపోతే, ఇక ఉపేక్షించేది లేదని పందుల యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, శుక్రవారం లోపు గ్రామాలలో ఎక్కడ కూడా పందులు కనిపిస్తే చర్యలు తప్పని వారు హెచ్చరించారు.