3.వ. రోజుకు చేరుకున్న గ్రామీణ తపాలా ఉద్యోగుల నిరవధిక సమ్మె
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: దీర్ఘకాలంగా అపరిస్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారంకోరుతూ,గ్రామీణ తపాలా ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం నాటికి మూడో రోజుకు రోజుకి చేరుకుంది.ఈ సందర్భంగా యూనియన్ నాయకులు భాష నరసింహులు ఖాజా మాట్లాడుతూ,గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తూ…చాలీచాలని జీతాలతోప్రజలకు ఉత్తరాల బట్వాడా,పొదుపు మరియు ఇన్సూరెన్స్ వంటితదితర సేవలను అందజేస్తూ,కనీస సదుపాయాలకు నోచుకోని,గ్రామీణ తపాలా ఉద్యోగుల పట్లకేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి,వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుపయోగమైన ఎన్నో పాత చట్టాలనురద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం బ్రిటిష్ కాలం నాటి తపాలా చట్టాలను అనుసరించిఇప్పటికీ తపాలా శాఖలో జిడిఎస్ వ్యవస్థనుకొనసాగించటం గర్హనీయమన్నారు.ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంతన మొండి వైఖరిని విడనాడి జిడిఎస్ వ్యవస్థను రద్దుచేసి,వారిని కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగాగుర్తించిఇతర ప్రభుత్వ ఉద్యోగుల లాగానేఅన్ని సదుపాయాలు వారికి కల్పించి,వారి జీవితాలలో మార్పు తీసుకురావాలనిలేనిపక్షంలో సమ్మెను ఇలాగేఉధృతంచేస్తామనిహెచ్చరించారు. ఈకార్యక్రమంలో స్థానిక నాయకులు భా ష, నరసింహులు, శివ, ఖాజా, నాగరాజు, సంజీవరాయుడు,బేబీరాణి, జయన్న, నాగేష్, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.